చంద్రబాబుకు జగన్ బర్త్ డే విషెస్

YS Jagan tweets birthday wishes to AP CM chandrababu nayudu

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు  70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి. కూడా  బర్త్ డే ‘బాబు’ కు విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో  ట్వీట్ చేశారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అధికార పక్షం, ప్రతిపక్ష నేతలుగా ఉన్న  సమయంలో వీరిద్దరూ పరస్పరం విమర్శించుకునే వారు. ఎన్నికల ఫలితాలపై ఇద్దరూ విజయంపైనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు జన్మదినం సందర్భంగా జగన్ ట్విటర్ లో శుభాకాంక్షలు తెలపడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Latest Updates