ప్రచారంలో దొంగలు : షర్మిల ఉంగరం లాక్కోబోయాడు

మెన్న కేఏపాల్….ఇవాళ షర్మిళ.. ఎన్నికల ప్రచారంలో నేతలకు షాక్ ఇస్తున్నారు కొందరు కేటుగాళ్లు. సందట్లో సడేమియా..అన్నట్లు..ఎన్నికల ప్రచారంలో నేతల ఆభరణాలను టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం మంగళగిరి నుంచి బస్సుయాత్ర ప్రారంభించిన షర్మిల కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. దీంతో చేతులు కలిపిన కొందరు…పనిలో పనిగా షర్మిల ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన షర్మిల చేతిని వెనక్కి లాక్కున్నారు. ఉంగరం కాస్త బిగుతుగా ఉండటంతో వేలు నుంచి రాలేదు. ఈ చోరీ యత్నం మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.

Latest Updates