నియంతకు సలహాదార్లు అవసరమా.. 

నియంతకు సలహాదార్లు అవసరమా.. 

చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? అని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల. నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించాడు కేసీఆర్. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశాడు కేసీఆర్. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చుకున్నాడని నిప్పులు చెరిగారు. 

సలహాదారుడుగా సోమేష్ ఎందుకు 

తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల వారికి  లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారు సోమేష్ కుమార్ లాంటి సలహాదారులు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? చంద్రశేఖర్ రావు ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండని సీఎంను వైయస్ షర్మిళ నిలదీసారు.

తడిసిన ధాన్యాన్ని కొంటారా.?కొనరా 

అకాల వర్షాలకు వడ్లు మొలకెత్తి ఓ కౌలు రైతన్న ప్రాణం పోయిందని, చనిపోతానని ముందే చెప్పినా కూడా ఆదుకోని అసమర్థ ప్రభుత్వం చంద్రశేఖర్ రావుదని షర్మిళ విరుచుకుపడ్డారు. కండ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిదని, రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దా అని నిలదీసారు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిళ.