యాత్ర చూసిన వైఎస్ విజయమ్మ

YS Vijayamma watches Yatra movie

YS Vijayamma watches Yatra movieహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం కథాంశంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమాను వైఎస్ఆర్ భార్య విజయమ్మ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు. సినిమా చూసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన యాత్ర  సినిమా చాలా బావుందన్నారు. డైరెక్టర్ మహికి, చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని మరోసారి ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆదరించారని చెప్పారు. ఆయన అనంతరం తమ పిల్లల్ని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు అని విజయమ్మ అన్నారు.

వైఎస్ఆర్ పాత్రలో కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ అయింది.

Latest Updates