రోజా నోట జూ.ఎన్టీఆర్ డైలాగ్

సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నగరి ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రను నవశకాన్ని నడిపించే టార్చ్ బేరర్ జగన్ మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత.. లోని డైలాగ్ ను ఆమె ఈ సందర్భంగా వాడారు.  ప్రతి 30 సంవత్సరాలకొకసారి బ్రతుకు ఆలోచన మారుతుందని, దానిని సినిమా భాషలో ట్రెండ్ అంటారని, రాజకీయ భాషలో తరం అంటారని, మామూలు జనం జనరేషన్ అంటారని అన్నారు. ప్రతి జనరేషన్ కు ఓ కొత్త ఆలోచనను ముందకు తీసుకెళ్లేది ఒకరేనని.. ఆ ఒక్కరిని టార్చ్ బేరర్ అంటారని, ఆ టార్చ్ బేరరే సీఎం జగన్ అని అన్నారు.

చిమ్మచీకట్లలో చిన్నాభిన్నమైన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు సీఎం జగన్ టార్చ్ బేరర్ గా దొరికాడని ఆమె అన్నారు. రాబోయో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నూతన ఆలోచనలతో ఈ రాష్ట్ర గతి మారబోతుందని ఆమె అన్నారు. ఐదేళ్ల నరకాసుర పాలన తర్వాత రాష్ట్రంలోని ఆడపిల్లలు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారని రోజా అన్నారు.

Latest Updates