జగన్ వంద రోజుల పాలనపై లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై  ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గత ఐదేళ్లుగా పచ్చని తివాచీ పరుచుకున్న ఆంధ్ర రాష్ట్రం, నేడు మీ తుగ్లక్ పరిపాలనలో రక్తమోడుతోందన్నారు. వైసీపీ రాక్షసులకు టీడీపీ కార్యకర్తల రక్తం కళ్లచూడందే నిద్ర పట్టడంలేదన్నారు. తుగ్లక్ 2.0 @100 డేస్  తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్ అన్నారు. అమరావతిని ఎడారి చేసారని.. పొలవరాన్ని మంగళవారంగా మార్చారంటూ ఎద్దేవా చేశారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారని… ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదంటూ సెటైర్లు వేశారు.

ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారని లోకేష్ అన్నారు.  పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారని విమర్శించారు.. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే అని అన్నారు లోకేష్.

Latest Updates