ఇక NTR భరోసా కాదు..YSR పెన్షన్

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసాను ‘వైఎస్సార్ పెన్షన్‌ కానుక’గా పేరు మార్చేసింది. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే నవరత్నాల హామీల అమలుకు తొలి అడుగు వేశారు. పెన్షన్‌ను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వనున్నారు. అలాగే వృద్ధుల పెన్షన్ వయస్సు 65 ఏళ్ల నుంచి నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. కొత్త పెన్షన్ పథకం జూన్‌ 1 నుంచి అమలు కాబోతుంది.

Latest Updates