15 ఏళ్లు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపారు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై  ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా చైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేదని ప్రశ్నించారు. చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 15 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు పేదప్రజలకు ఎప్పుడైనా ఒక్క గజం స్ధలం అయినా పంచారా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హంద్రీనీవాను కేవలం ఐదు టిఎంసిలకు పరిమితం చేశారన్నారు.

హంద్రీనీవాకు చంద్రబాబు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాకు హార్టికల్చర్ వచ్చిందని..అది వైయస్ చలవేనన్నారు. 15 ఏళ్లు గ్రాఫిక్స్ తో చంద్రబాబు కాలం గడిపారన్నారు. సీఎంపై  ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తున్నారన్నారు.

 

Latest Updates