చంద్రబాబు..పల్నాడు నడిబొడ్డులో చర్చకు రెడీనా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో వైసీపీ  నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని అన్నారు.  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వైసీపీ నేతలపై దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలను బహిష్కరించడమే కాకుండా ఓటు కూడా వేయనియ్యలేదన్నారు. టీడీపీ నేతలు నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎలాంటి అరాచకాలు పాల్పడ్డరో అందరికి తెలుసన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరు తప్పుడు కేసులు పెట్టారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీ షీటర్లను తీసుకొచ్చి చంద్రబాబు పునరావాస మీటింగ్ లు పెడుతున్నారని విమర్శించారు. పల్నాడులో జరిగిన అరాచాకాలపై  చర్చకు తాము సిద్ధమని..చంద్రబాబు  చర్చకు రాగలరా? అని సవాల్ విసిరారు.

 

 

Latest Updates