మార్పు తెస్తున్నాం: బహుజన రాజధానిగా అమరావతి

కొన్ని వర్గాలకు పరిమితమైన అమరావతి ఇప్పుడు బహుజన అమరావతిగా మారుతుందని అన్నారు వైసీపీ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన… పేదలకు అమరావతిలో 54వేల ఇండ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.. దీంతో రెండు లక్షల మంది ప్రజలకు కొత్తగా ఆశ్రయం దొరుకుతుందని చెప్పారు. ఇండ్ల స్థలాలపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. 54వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు బాధ ఎందుకని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆయన అన్నారు. రాజధానిలోకి పేదలెవ్వరినీ రానివ్వకూడదని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు లాంటి గొప్పోల్లే ఉండాలా అని అన్నారు. రాష్ట్రంలో బలవంతంగా భూసేకరణ జరగడంలేదని తెలిపారు.

Latest Updates