రోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ..ఎఫ్ఐఆర్ నమోదు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొడుకు అవినాష్ వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై అతని స్నేహితులతో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులు,స్థానికులు నానా అవస్థ పడ్డారు.  బర్త్ డే సందర్భంగా అవినాష్  బుధవారం అతని స్నేహితులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల చౌరస్తాలో డీజే, డిస్ ప్లే  ఏర్పాటు చేసి సాంగ్స్ పెట్టారు. కేక్ కట్ చేసి నానా హంగామా చేశారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టూవీలర్ వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థతి. దీంతో వాహనదారులు, కాలేజీ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డ్ అవడంతో అవినాష్ అతని స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అంబాజీ పేట పోలీసులు చెప్పారు.

Latest Updates