టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై సీబీఐతో విచారణ చేయించాలి

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాశారు. రవిప్రకాష్ పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. బ్లాక్ మెయిలింగ్ ద్వారా డబ్బులు వసూలు చేయడం, సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో సిద్ధహస్తుడని తెలిపారు. ప్రభుత్వానికి పన్ను చెల్లింపుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మొయిన్ ఖురేషీ , సానా సతీశ్ బాబుతో రవిప్రకాష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లేఖలో తెలిపారు.

2009లో రవిప్రకాశ్ ఉగాండ రాజధాని కంపాలాలో కొనుగోలు చేసిన  సిటీకేబుల్‌లో షేర్లు, 2011 అమెరికాలోని మాయా విజన్ ఎల్‌ఎల్‌సీలో కొనుగోలుచేసిన 15 వేల షేర్ల వివరాలను ప్రభుత్వానికి  తెలియజేయకుండా రహస్యంగా ఉంచారని అన్నారు. ఇలా అనేక చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన రవిప్రకాశ్‌పై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయన్నారు. సంబంధిత ఆధారాలను విజయసాయి  సుప్రీంకోర్టు జడ్జికి రాసిన లేఖలో చేర్చారు.

Latest Updates