ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌తిరోజు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే టెస్టులు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు.

ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తనకు పాజిటివ్ అని విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. గత వారం రోజుల్లో తనను నేరుగా కలిసిన వారు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తనకు కరోనా నెగటివ్‌గా తేలే వరకు కలవడానికి ఎవరు రావొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించినట్లు సమాచారం.

Latest Updates