గుంటూరు: కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యర్తలు

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రంధశిరి గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో కిలారి శ్రీను, కిలారి సాంబయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని  సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ట్రాక్టర్, బైక్ లను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల వారిని గృహనిర్బంధం చేశారు.

Latest Updates