ఒకరినొకరు పొగుడుకున్న యువీ, అక్తర్

yuvraj-singh-a-rockstar-and-a-patriotic-indian-shoaib-akhtar-says
  • నువ్వు మోస్ట్​ స్టయిలిష్‌‌ ప్లేయర్​: అక్తర్
  • నన్ను భయపెట్టింది నువ్వే: యువీ

న్యూఢిల్లీ : టీమిండియాకు ఆడిన లెఫ్ట్‌‌ హ్యాండ్‌‌ బ్యాట్స్‌‌మెన్​లో యువరాజ్‌‌ సింగ్‌‌ను మించిన స్టయిలిష్‌‌ ప్లేయర్‌‌ మరొకరు లేరని పాకిస్థాన్‌‌ మాజీ పేసర్‌‌ షోయబ్‌‌ అక్తర్‌‌ కొనియాడాడు. అయితే తనని భయపెట్టిన ఏకైక బౌలర్‌‌ షోయబ్‌‌ అక్తరేనని పేర్కొంటూ రావల్పిండి ఎక్స్‌‌ప్రెస్‌‌ ప్రశంసకు యువీ బదులిచ్చాడు. యువీ రిటైర్మెంట్‌‌పై స్పందించిన అక్తర్​ యూట్యూబ్‌‌లో ఓ వీడియో పోస్ట్‌‌ చేశాడు. ‘యువీ ఓ రాక్‌‌స్టార్‌‌, ఓ మ్యాచ్‌‌ విన్నర్‌‌, గ్రేట్‌‌ జూనియర్‌‌, చాలా మంచి స్నేహితుడు’ అని  షోయబ్‌‌ అన్నాడు.2003 వరల్డ్‌‌కప్‌‌లో తొలిసారి యువీని ప్రత్యర్థిగా ఎదుర్కొన్నానని  గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌‌లో యువీతో మాట్లాడానని గేమ్‌‌ పట్ల అతనికి ఉన్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నాడు. ఇండియాతో మ్యాచ్‌‌ అంటే యువీ కోసం స్కెచ్‌‌ రెడీ చేసుకునే వాళ్లమని అక్తర్‌‌ చెప్పాడు. దీనికి ‘నిజం చెబుతున్నా బౌలింగ్‌‌ వేయడానికి నువ్వు రనప్‌‌ స్టార్ట్‌‌ చేసిన ప్రతీసారి నేను చాలా భయపడేవాడిని. నీ బౌలింగ్‌‌ను ఎదుర్కునేందుకు నా దైర్యాన్ని అంతా కూడగట్టుకునేవాడిని. మైదానంలో మనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి వాటిని ఎప్పటికీ మరిచిపోను’  అని యువీ ట్వీట్‌‌ చేశాడు.

Latest Updates