పీఎం కేర్స్‌కు యువీ, భజ్జీ విరాళాలు

క‌రోనా వైర‌స్ పై పోరాటంలో క్రీడాకారులు త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ రిక్వెస్ట్ మేరకు ఆప‌ద‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసేందుకు ఒక్కొక్క‌రు ముందుకువ‌స్తున్నారు. పీఎం కేర్స్‌కు రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక విరాళ‌మిస్తున్న‌ట్లు భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ‘క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా ఉంటే.. మ‌నం మ‌రింత బ‌లంగా పోరాటం చేయ‌వ‌చ్చు. ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపం వెలిగించ‌బోతున్నాను.

సంఘీభావ దిన‌మైన ఈ రోజు కొవిడ్‌-19పై పోరాడేందుకు రూ.50 ల‌క్ష‌లు విరాళ‌మిస్తున్నాను. మీరు కూడా వీలైనంత స‌హాయం చేయండి’ అని యువీ ట్వీట్ చేశాడు. మ‌రోవైపు భారత సీనియ‌ర్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్‌సింగ్ కూడా త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. జ‌లంధ‌ర్‌లో 5వేల కుటుంబాల‌కు రేష‌న్ ఇచ్చేందుకు భ‌జ్జీ సిద్ధ‌మ‌య్యాడు.

Latest Updates