నువ్వు ఎప్పటికీ యోధుడివే: సంజయ్ దత్‌పై యువీ ట్వీట్

న్యూఢిల్లీ: ఇటీవల అనారోగ్యానికి గురైన బాలీవుడ్ హీరో సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. సంజూకు స్టేజ్‌ 4 క్యాన్సర్‌‌గా ఉన్నట్లు తేలింది. సంజయ్‌ను ఫైటర్‌‌గా అభివర్ణించిన యువీ.. త్వరగా రికవర్ అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘నువ్వు ఎప్పటికీ యోధుడివే. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదే విధంగా నువ్వు ఎంత బలమైన వాడివో కూడా నాకు తెలుసు. ఈ కఠిన పరిస్థితులను నువ్వు అధిగమిస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మాజీ లెఫ్టాండర్ బ్యాట్స్‌మన్ ట్వీట్ చేశాడు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో సంజయ్ దత్‌ను శనివారం ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం ఆయనను డిశ్చార్జ్ చేశారు. కరోనా టెస్టుల్లో ఆయనకు ఏమీ తేలలేదని సమాచారం. అయితే ఆయన ఛాతీలో ఏదో ఫ్లూయిడ్ ఉన్నట్లు డాక్టర్స్ గమనించారు. సంజూకు స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఉన్నట్లుగా గుర్తించారు.

Latest Updates