వీడియో: యూవీ ఆరు సిక్సులు కొట్టి నేటికి 13 ఏళ్లు

యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి నేటికి 13 ఏళ్లు గడిచింది. ఆ మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ యూవీ.. సమయం ఎలా గడిచిపోతుందో అంటూ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టిన వీడియోను తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీ20 వరల్డ్ కప్‌ ప్రారంభ సీజన్‌లో యూవీ ఈ ఘనతను సాధించాడు. డర్బన్ వేదికగా భారత్, ఇంగ్లండ్‌‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో స్టూవర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్‌లో యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆనాటి రికార్డును తాను మాత్రమే కాకుండా.. బౌలర్ బ్రాడ్ కూడా గుర్తుంచుకుంటాడని యూవీ అన్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 218/4 పరుగులు చేసి ఇంగ్లాండ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.

భారత్ తరఫున 58 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్.. టీ20 కెరీర్‌లో 1,177 పరుగులు చేశాడు.

For More News..

కేసీఆర్ గారూ.. మీరూ కొట్టుకపోకముందే పరిస్థితిని చక్కదిద్దండి

అప్పు చెల్లించడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్..

వీడియో: మోడీ బర్త్‌డే వేడుకలు చేయబోతే.. పేలిన హీలియం బెలూన్లు

Latest Updates