క్రికెట్ లో కొత్త రూల్ కంకషన్ పై కాంట్రవర్సరీ

క్రికెట్‌ లో కొత్తగా తీసుకొచ్చిన కంకషన్‌ సబ్​స్టిట్యూట్‌ రూల్‌ ను టీమిండియా ఫస్ట్‌‌‌‌ టైమ్‌ ఉపయోగించుకోగా అది వివాదానికి దారితీసింది.ఇండియా ఇన్నింగ్స్‌ లాస్ట్ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ వేసిన బౌన్సర్‌‌‌‌.. జడ్డూ హెల్మెట్‌ ను బలంగా తాకింది. అయినా ఆ ఓవర్‌‌‌‌లో ఇంకో మూడు బాల్స్‌ ఆడి రెండు ఫోర్లు కొట్టిన ఆల్‌ రౌండర్‌‌‌‌ అంతకుముందే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియోతో ట్రీట్‌ మెంట్‌ కూడా చేయించు కున్నాడు. అయితే, డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వచ్చిన తర్వాత తల తిరుగుతోందని ఫిజియోకు చెప్పడంతో జడ్డూ ప్లేస్‌ లో కంకషన్‌ సబ్‌ స్టిట్యూట్‌ గా స్పిన్నర్‌‌‌‌ చహల్‌ ను పంపినట్టు బీసీసీఐ ప్రకటించింది. జడేజా ప్రస్తుతం టీమ్‌ డాక్టర్‌‌‌‌ పర్యవేక్షణలో ఉన్నాడన్న బోర్డు అవసరం అయితే శనివారం స్కానింగ్​ చేయిస్తామని చెప్పింది.

అలాగే, సిరీస్​లో మిగతా రెండు మ్యాచ్​లకూ జడేజా దూరంగా ఉంటాడని, అతని ప్లేస్​లో శార్దూల్​ ఠాకూర్ ను టీ20 టీమ్​లో చేర్చినట్టు ప్రకటించింది. లాంగర్ అసంతృప్తి క్రికెట్‌ హిస్టరీలోనే కంకషన్‌ ను ఫస్ట్‌‌‌‌ ఉపయోగించిన ఆసీస్‌ .. చహల్‌ ను తీసుకోవడంపై మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. జడేజా స్థానంలో చహల్‌ ఫీల్డింగ్‌ కు రావడం చూసిన ఆ టీమ్‌ చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌‌‌‌.. మ్యా చ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే రూల్స్‌ ప్రకారమే చహల్‌ వచ్చాడని బూన్‌ స్పష్టం చేయడంతో లాం గర్‌‌‌‌ చేసేదేమీలేక వెనుదిరిగాడు. మరోవైపు ఆల్‌ రౌండర్‌‌‌‌ అయిన జడేజా ప్లేస్‌ లో ప్యూర్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ చహల్‌ ను ఎంచుకోవడం సరైన రీప్లేస్‌ మెంట్‌ అవుతుందా? అని ఆసీస్‌ ప్లేయర్‌‌‌‌ హెన్రిక్స్‌ ప్రశ్నించాడు.ఇక, జడేజాకు బౌన్సర్‌‌‌‌ తగిలిన వెం టనే ఫిజియో గ్రౌండ్‌ లోకి వచ్చి అతని సి చ్యువేషన్‌ తెలుసుకోకపోవడం ప్రొటోకాల్​ను బ్రేక్‌ చేసినట్టు అవుతుందని కామెం టేటర్‌‌‌‌ సంజయ్‌ మంజ్రేకర్‌‌‌‌ అన్నాడు. ఇదే కారణం చెబుతూ జడేజా ఇంజ్యురీపై ఆసీస్‌ మాజీ క్రికెటర్‌‌‌‌ టామ్‌ మూడీ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, సెహ్వా గ్‌ మాత్రం ఇండియా నిర్ణయాన్ని సమర్థించాడు. తలకు బంతి తగిలినప్పుడు లక్షణాలు బయటపడేందుకు 24 గంటల వరకూ సమయం పడుతుందన్నాడు.

Latest Updates