Yuzvendra Chahal: క్రికెట్ పక్కన పెట్టి ఏంటి ఈ పనులు..! ఓరీతో చాహల్ పోజులు

Yuzvendra Chahal: క్రికెట్ పక్కన పెట్టి ఏంటి ఈ పనులు..! ఓరీతో చాహల్ పోజులు

బాహుబలి విడుదలయ్యాక అందరి మదిలో మెదిలిన ఏకైక ప్రశ్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే కదా! అచ్చం అదే తరహాలో సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారి మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. అదేటంటే.. ఓర్హాన్ అవత్రమణి ఎవరని..? సెలబ్రిటీల మొదలు వ్యాపారవేత్తల వరకూ అందరితో ఫోటోలు దిగుతున్న ఈ వ్యక్తి గురుంచి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. తాజాగా, సదరు ఓరీతో మన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఫోటోలకు పోజులిచ్చారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

పేలవ ప్రదర్శనలతో జట్టుకు దూరమైన చాహల్ తన విరామ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కుదిరితే భార్యతో కలిసి విదేశీ పర్యటనలు లేదంటే స్వదేశీ గడ్డపై పార్టీలంటూ తిరుగుతున్నారు. అలా చాహల్ ముంబైలో ఒక పార్టీకి హాజరవ్వగా.. అక్కడ ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అవి నెట్టింట వైరల్ అవ్వడంతో చాహల్‌పై నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. జట్టులో తిరిగి స్థానమెలా దక్కించుకోవాలనేది మానేసి ఇవేం పనులని అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ మాటల్లో చెప్పలేనటువంటి కొన్ని దారుణమైన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఎవరీ ఓర్హాన్ అవత్రమణి..?

ఓరీ అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి. ఆయన వ్యాపారవేత్త సూరజ్ అవత్రమణి కుమారుడు. బిజినెస్ మ్యాన్ కొడుకు కావడంతో ఓరీ చదవంతా పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రెటీల పిల్లలతో కలిసి సాగింది.  అలా స్టార్ కిడ్స్‌ అందరితో అతనికి పరిచయం ఉంది. సారా అలీఖాన్ మొదలు జాహ్నవి కపూర్, సచిన్ తనయ సారా టెండూల్కర్ వరకు ఎంతో మంది స్టార్ కిడ్స్ ఓరీని మంచి స్నేహితునిగా భావిస్తారు. అంతెందుకు.. అంబానీ కోడళ్లు శ్లోకా అంబానీ, రాధికా మర్చెంట్‌ కూడా ఓరీని మంచి స్నేహితురాళ్లట. పార్టీల పేరుతో వీరందరూ ఒక్కచోట చేరడం కామన్ కనుక ఫోటోలు తరుచూ వైరల్ అవుతుంటాయి.