కరోనా టెన్షన్.. మాస్క్ తో వెళ్లిన చాహల్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌  వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండియా క్రికెటర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఈ నెల 12న జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం మంగళవారం ధర్మశాల వెళ్లిన స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌లో మాస్క్‌‌‌‌‌‌‌‌ ధరించాడు. మాస్క్‌‌‌‌‌‌‌‌తో తీసుకున్న సెల్ఫీని అతను ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. మరోవైపు ఈ టూర్‌‌‌‌‌‌‌‌లో ఎవ్వరికీ షేక్‌‌‌‌‌‌‌‌హ్యాండ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వబోమని సౌతాఫ్రికా క్రికెట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ప్రకటించింది. మెడికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను వెంటబెట్టుకొని ఆ జట్టు ఇండియా వచ్చింది. వైద్యుల సూచన మేరకు అభిమానులను కలవకూడదని, వారికి సెల్ఫీలు ఇవ్వకూడదని సఫారీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

Latest Updates