మళ్లీ మొదలైన సీరియల్స్ సందడి

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ‘జీ తెలుగు’లో మళ్లీ సీరియల్స్‌ సందడి మొదలైంది. అన్ని ఛానెల్స్ లాగానే రెగ్యులర్‌గా సీరియల్స్ ను అందిస్తోంది. ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్‌ గతంలో లాగే టాప్‌‌‌‌‌‌‌ రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. ఈ రోజు నుంచి సీరియల్స్ లో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. ‘నెం.1  కోడలు’, ‘త్రినయని’ సీరియల్స్ లో ఇవ్వాళ్టి నుంచి పెళ్లిళ్ల స్పెషల్‌‌‌‌ ఎపిసోడ్స్‌ టెలికాస్ట్‌‌‌‌ కాబోతున్నాయి. ‘నెం.1 కోడలు’ సీరియల్‌లో రాహుల్‌–సరసు, ‘త్రినయని’ సీరియల్‌లో విశాల్‌‌‌‌– నయని జంటలు పెళ్లి చేసుకోవడం గురించే ఇప్పటిదాకా ఆసక్తికరమైన కథ నడిచింది. ఇప్పుడీ రెండు జంటలూ ఏకం కాబోతున్నాయి. ‘నెం.1 కోడలు’ సీరియల్‌‌‌‌లో ఊరి జనం అంతా కలిసి పెద్దయ్యను ఒప్పించి, రాహుల్‌కు ఇష్టం లేకపోయినా సరసు మెడలో తాళి కట్టిస్తారు. ‘త్రినయని’లో తన తండ్రి జగదీష్‌ కోసం విశాల్‌‌‌‌ నయనిని పెళ్లి చేసుకుంటాడు. ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ఈ పెళ్లిళ్లకు సంబంధించిన ఎపిసోడ్స్‌ ప్రసారమవుతాయని ‘జీ తెలుగు’ చెప్పింది. ఈ సీరియల్స్‌ ప్రతి రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు టెలికాస్ట్‌‌‌‌ అవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ‘అన్‌లాక్‌’ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌‌‌‌ చేసినట్లు యూనిట్‌ చెప్పింది. దాదాపు మూడు నెలల తర్వాత ఈ షోస్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అవుతుండటం విశేషం.

 

Latest Updates