కోహ్లీకి ఏమైంది.? వరుసగా 19 ఇన్నింగ్సుల్లో నో సెంచరీ

టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో మూడోసారి చెత్త ట్రాక్ రికార్డ్ ను కొనసాగించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. పరుగుల మిషన్ గా పిలుచుకునే కోహ్లీ ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో చెత్త ఫర్ఫామెన్స్  కొనసాగిస్తున్నాడు.న్యూజిలాండ్ టూర్ లో మూడు ఫార్మాట్లలో కలిసి 8 ఇన్నింగ్సుల్లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా రాణించలేకపోయాడు.  ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో తక్కువ సయమంలోనే వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలతో మొత్తం 70 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న కోహ్లీ గత 19 అంతర్జాతీయ ఇన్నింగ్స్ లలో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం కోహ్లీకి బ్యాడ్ అనే చెప్పవచ్చు. 2019 నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో చివరి సారిగా సెంచరీ చేసిన కోహ్లీ ఇప్పటి వరకు మూడంకెల స్కోరును అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు.

తన 11 ఏళ్ళకు పైగా అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీ 19 ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయకపోవడం ఇది మూడవ సారి. గతంలో కోహ్లీ 2011 ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు వరుసగా 24 ఇన్నింగ్స్‌లలో సెంచరీ  చేయలేకపోయాడు. మళ్లీ 2014 ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు వరుసగా 25 ఇన్నింగ్సుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇపుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు 19 ఇన్నింగ్సుల్లో ఒక్క సెంచరీ చేయలేకపోయాడు..

Latest Updates