ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండగా.. ఫ్రెంచ్ కిస్ ఎందుకు?: నెటిజన్స్ రెస్పాన్స్ అదుర్స్

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా వారం ముందే ప్రేమికుల సంబరాలు మొదలైపోయాయి. ఫిబ్రవరి 7న రోజ్ డే మొదలు.. 8న ప్రపోజ్ డే ఇలా రోజుకో స్పెషల్ డేతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేమ జంటలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు సరే.. మరి లవ్‌లో లేని వారి సంగతేంటి? ‘సింగిల్స్ లెస్ట్ మింగిల్ విత్ ఫేఫరెట్ ఫుడ్’ అంటోంది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమోటో. ఈ ఆలోచనతో వెరైటీగా వాలంటైన్ వీక్ థీమ్‌తో రోజుకో రకంగా ఆకట్టుకుంటోంది. రోజ్‌ డేని గులాబ్ జామ్ డేగా మార్చింది జొమోటో. ‘గులాబ్ జామ్‘ ఉండగా.. గులాబ్ (రోజా పువ్వు) ఎందుకు అంటూ ఫిబ్రవరి 7న ట్వీట్ చేసింది ఆ సంస్థ. ఇక ఫిబ్రవరి 11న ప్రామిస్ డే సందర్భంగా.. ‘జీవితంలో కష్ట సుఖాలు ఎదురవుతుంటాయి. కానీ అన్ని సందర్భాల్లోనూ మీతో నేనుంటా. చీజ్ పిజ్జాతో ఎప్పటికీ ప్రేమలో ఉండేలా ప్రామిస్ చేస్తున్నా’ అని ట్వీట్ పెట్టింది జొమోటో.

కిస్ డే స్పెషల్ అట్రాక్షన్

వాలంటైన్ వీక్‌లో జొమోటో చేసిన ట్వీట్స్ అన్నింట్లోనూ ఫిబ్రవరి 13న కిస్ డే సందర్భంగా చేసిన పోస్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ‘ఫ్రెంచ్ ఫ్రైస్‌ని కిస్ చేయగలిగినప్పుడు.. ఫ్రెంచ్ కిసెస్ ఎందుకు?’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఫుల్ హిలేరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇక్కడ మేం పేదోళ్లం.. కానీ సింగిల్ కాదు’ అంటూ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి డబ్బులు లేవ్ కానీ, ఫ్రెంచ్ కిస్‌కి ఇబ్బంది లేదన్నట్లుగా ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. ‘ఫ్రెంచ్ ఫ్రైస్ తిరిగి నన్ను కిస్ చేయవు కదా’ అంటూ ఓ యువతి కామెంట్ చేసింది. ‘ఒకటి క్యాలరీస్ కరిగిస్తే.. మరొకటి అతిగా క్యాలరీలు తెచ్చిపెడుతుంది’ అని మరో నెటిజన్ అన్నాడు. స్విగ్గీ ఉండగా జొమోటో ఎందుకు అంటూ ఆ కంపెనీకి సెటైర్ వేశాడు ఓ వ్యక్తి. మరికొందరు అడ్వర్టైజ్‌మెంట్ సూపర్ అంటూ, ఇంకొందరు మేం సింగిల్ ఏదైనా ఆఫర్ ఉందా అంటూ ట్వీట్లు చేశారు.

Latest Updates