20 గోడౌన్లు పెట్టనున్న జొమాటో

Zomato to add 20 warehouses by 2020
  • ఒక్కో వేర్ హౌస్ కుదాదాపు రూ. 3 కోట్లు
  • తాజా ఉత్పత్తుల సరఫరా కోసమే

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరో 20 వేర్‌ హౌస్‌ లు నెలకొల్పడానికి జొమాటో రూ.56 కోట్లు వెచ్చించనుంది. బీ2బీ ప్లాట్‌ ఫామ్‌ హైపర్‌ ప్యూర్‌ కింద 2020 నాటికి ఈ 20 వేర్‌ హౌస్‌ లు ఏర్పాటు చేయనున్నట్లు జొమాటో  వెల్లడించింది. జొమాటోకు ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలలో మాత్రమే రెండు వేర్‌ హౌస్‌ లున్నాయి. ఆ రెండింటి సామర్ధ్యం  నెలకు 9 వేల టన్నులు. దేశంలోని వివిధ నగరాలలో మరో 20 హైపర్‌ ప్యూర్‌ వేర్‌ హౌస్‌లు పెట్టనున్నా మని, 2020 నాటికి వాటి ఏర్పాటు పూర్తి చేయాలని టార్గెట్‌ గా పెట్టుకున్నామని జొమాటో కో ఫౌండర్‌ , సీఓఓ  గౌరవ్‌ గుప్తా తెలిపారు.ఒక్కో వేర్‌ హౌస్‌ ఏర్పాటు కు రూ. 2.8 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

తాజా కూరగాయలు,ఆహారోత్పత్తులను రె స్టారెంట్లకు అందచేయడానికి హైపర్‌ ప్యూర్‌ ప్లా ట్‌ ఫామ్‌ కీలకమైనదిగా మారిందని గుప్తా అన్నా రు. ఢిల్లీలో నెలకు 5 వేల టన్నుల సామర్ధ్యంతో 40 వేల చదరపు అడుగుల వేర్‌ హౌస్‌ ను బుధవారం నాడు కంపెనీ లాంఛ్‌ చేసింది. రోజూ 3 వేల రెస్టారెంట్లకు అవసరమైన తాజా వస్తువులను ఈ వేర్‌ హౌస్‌ నుంచి సప్లై చేయగలుగుతారు. ఇండియాలోని 18 నగరాలలో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 వేర్‌ హౌస్‌ ల ఏర్పాటుతో, నెలకు 90 వేల టన్నుల నిల్వ చేసే సామర్ధ్యం అందుబాటులోకి వస్తుందని హైపర్‌ ప్యూర్‌ ఫౌండర్‌ ధృవ్‌ సాహ్నీ చెప్పా రు. హైదరాబాద్‌‌ సహా, ఢిల్లీ, బెంగళూరు, ముం బై,పుణె, చెన ్నై, కోల్‌ కత, జైపూర్‌ , అహ్మదా బాద్‌‌,చండీగఢ్, నాగ్‌ పూర్‌ , లక్నో, వదోదర, కోయంబ-త్తూర్‌ , కోచ్చి , ఆగ్రా, గోవా, సూరత్‌ నగరాలలోఈ 20 హైపర్‌ ప్యూర్‌ వేర్‌ హౌస్‌ లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్లలోనూ ఈ హైపర్‌ ప్యూర్‌ వేర్‌ హౌస్‌ లు నెలకొల్పాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

జొమాటో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాలలోనే పెడతామని,ఎప్పుడనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రెస్టారెంట్లకు తాజా ఉత్పత్తులను అందించే లక్ష్యంతో 2018లో హైపర్‌ ప్యూర్ ఏర్పాటయింది. హోటళ్లు, రె స్టారెంట్లు, కేటరర్లకు ఫుడ్‌ ఇన్‌‌గ్రీడియెంట్స్‌ (ఆహారోత్పత్తులు) అందిం చేందుకు ఈ బీ2బీ ప్లాట్‌ ఫామ్‌ ను మొదలెట్టారు. రైతులు, మిల్లులు, ఉత్పత్తిదారుల నుంచి నేరుగా ఈ హైపర్‌ ప్యూర్‌ కొనుగోళ్లు చేస్తుంది. ఫలితంగా, ప్రతి ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తోందనే విషయంలో పూర్తి స్పష్టత సాధ్యమవుతుందని సాహ్నీ వివరించారు. జొమాటోను దీపిందర్‌ గోయెల్‌ నెలకొల్పారు. రెస్టారెంట్‌ రి వ్యూ, రె స్టారెంట్‌ డిస్కవరీ, ఫుడ్‌డెలివరీ రంగాలలో జొమాటో ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తోం ది. 24 దేశాలలోని 14 లక్షల రెస్టారెంట్లకు జొమాటో ఇన్ఫర్మే షన్‌‌  అందిస్తోంది.

Latest Updates