ఫేక్‌‌ డాక్యుమెంట్స్‌‌కు చెక్‌‌…  అస్లీ స్టాంప్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : ఫేక్‌‌ సర్టిఫికెట్ల కట్టడికి తమ హైదరాబాద్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్ అస్లీ స్టాంప్‌‌ పేరిట వినూత్నమైన డీయాప్‌‌ను తెచ్చినట్లు బ్లాక్‌‌చైన్ కంపెనీ జొరియం ల్యాబ్స్‌‌ తెలిపింది. ట్రేడ్ లేబుల్స్‌‌, డాక్యుమెంట్‌‌ మోసాలను కూడా దీంతో ఎదుర్కోవచ్చని జొరియం పేర్కొంది. బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీ ఆధారంగా ఈ అస్లీస్టాంప్‌‌ రూపొందించినట్లు వివరించింది. సర్టిఫికెట్ల జారీకి యూనివర్శిటీలు అస్లీస్టాంప్‌‌ను ఉపయోగించుకునే వీలుందని, ఆర్‌‌ఎఫ్‌‌ఐడీ వంటి టెక్నాలజీలతో పోలిస్తే చాలా తక్కువ వ్యయంతోనే దీనిని వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. భద్రతాపరంగా చూస్తే బ్లాక్‌‌చైన్‌‌ ప్రస్తుతం ఇతర టెక్నాలజీలు అన్నింటికంటే మేలైనదని తెలిపింది.

సింగపూర్‌‌కు చెందిన జొరియం ల్యాబ్స్‌‌ హైదరాబాద్‌‌లో డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌ నెలకొల్సింది. డిజిటల్ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు వంటి విలువైన పత్రాలను మేనిప్యులేట్‌‌ చేసే అవకాశం టెక్నాలజీ కల్పిస్తోందని, దానిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే బ్లాక్‌‌చైన్ లాంటి టెక్నాలజీలే కరెక్టని జొరియం ల్యాబ్స్‌‌ ఫౌండర్‌‌ రామకృష్ణ తెలిపారు. బ్లాక్‌‌చైన్‌‌ క్యూఆర్‌‌ కోడ్‌‌తో పనిచేసే అస్లీమెడిసిన్ యాప్‌‌ను కూడా జొరియం ఇంతకు ముందే తెచ్చింది. ఫేక్‌‌ మెడిసిన్స్‌‌ను నిరోధించడానికి ఈ యాప్‌‌ తయారు చేశారు.

Latest Updates