ఇంటికి రాలే.. డ్యూటీకి పోలే

ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓ ఆఫీసర్ కనిపించడంలేదు. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లు తట్టుకోలేకే కనపడకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. విధులకు గైర్హాజర్‍ కావడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు అంటున్నారు.  మహబూబ్ నగర్ కు చెందిన నర్సింగ్ రావుకు ఇటీవలే మహబూబ్ నగర్‍ జడ్పీ డిప్యూటీ సీఈవోగా పదోన్నతికల్పించారు. అడ్డాకుల మండలం ఎంపీడీవోగా ఉన్న ఆయనకు ప్రమోషన్‍ ఇచ్చి కొత్త జిల్లా నారాయణపేటకు బదిలీ చేశారు. ప్రస్తుతం లైజనింగ్‍ ఆఫీసర్ గా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. నాలుగురోజులుగా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఆయన డ్యూటీకి రావడంలేదంటూ ఎన్నికల సంఘానికి నివేదించి విధులనుంచి తప్పించారు.

తన కొడుకుకు ప్రమోషన్ఇచ్చి పని ఒత్తిడి పెంచారని, కనీసం కిందిస్థాయి సిబ్బందిని కూడా కేటాయించలేదని తల్లిమీరాబాయి అంటోంది. కుటుంబసభ్యులు మహబూబ్ నగర్‍ రూరల్‍ పీఎస్ లో ఫిర్యాదుచేశారు. ఈ విషయమై నారాయణపేట కలెక్టర్‍ వెంకట్రావ్‍ మాట్లాడుతూ తామంతా ఒత్తిడి తోనేపని చేస్తున్నామని, రెండు రోజులుగా డ్యూటీకి రాకపోవడంతో ఎన్నికల సంఘానికి నివేదించి చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఆఫీసర్అదృశ్యమైన విషయం తమకు తెలియదని, వారికుటుంబ సభ్యులను అడగాలని అన్నారు. కేసునమోదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Latest Updates