జడ్పీకే సై అంటున్న నేతలు : అసక్తికరంగా పరిషత్ రాజకీయం

జనగామ, వెలుగు : ములుగు జిల్లా తొమ్మిది మండలాలతో ఇటీవల ఏర్పడింది. మంగపేట మండలంలో కోర్టు కేసు కారణంగా ప్రస్తుతానికి ఎన్ని కలు లేవు. మిగిలిన ఎనిమిది మండలాల్లో 8 జడ్పీ టీసీ స్థానా లున్నాయి. జనరల్‌‌గా రిజర్వ్‌‌ అయిన ఇక్కడి జడ్పీ చైర్మన్‌‌ పీఠం దక్కించుకునేందుకు గెలిచిన జడ్పీటీసీకి మరో నలుగురు సభ్యుల మద్దతుంటే చాలు. ఇదే జిల్లాలోని ములుగు మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ మండలం ఎంపీపీగా నెగ్గేందుకు గెలిచిన ఎంపీటీసీకి మరో తొమ్మిది మంది సభ్యుల మద్దతు కావాలి. తెలంగాణలో 32 జిల్లాలు ఉండగా అందులో 13 జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో ఎంపీపీ కావడం కంటే జడ్పీ చైర్మన్‌‌ పదవి దక్కించుకోవడమే ఈజీ అన్నట్లు గా పరిస్థితి ఉంది. కష్టం తక్కువ.. హోదా ఎక్కువ కావడంతో జడ్పీ చైర్మన్‌‌ టార్గెట్‌‌గా నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.

జిల్లాల పునర్వి భజన తర్వా త తొలిసారిగా జరుగుతున్న ఈ స్థానిక ఎన్ని కలు ఆసక్తికరంగా మారాయి. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైన జిల్లాల్లో 13 చోట్ల అక్కడి జడ్పీటీసీ స్థానాల కంటే అదే జిల్లాలో ఉన్న మండలాల్లోని ఎంపీటీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో సంఖ్య సమానంగా ఉంది. అధిష్ఠానం ఆశీస్సులు ఉంటే జడ్పీ పీఠం దక్కడం చాలా సులువన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ఎంపీపీ అవుదామనే ఆలోచన కన్నా జిల్లా పీఠాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్‌‌గా పెట్టు కుంటున్నారు. ఫలితంగా ఆశావహులు పైరవీలు తీవ్రం చేశారు.

కోట్లల్లో ఖర్చుకు రెడీ

జడ్పీటీసీల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జడ్పీ పీఠం కోసం ఖర్చు మాత్రం తడిసి మోపెడు కానుంది. పోటీ తీవ్రత ఆధారంగా రూ. కోటి నుంచి రూ. రెండు కోట్లకు పైగా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. జనగామ జిల్లా జడ్పీ చైర్మన్‌‌ జనరల్‌‌గా రిజర్వ్‌‌ అయింది. ఈ జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నవారు రిజర్వే షన్‌‌ అనుకూలంగా ఉన్న మండలాల నుంచి బరిలో ఉండేందుకు శ్రమిస్తున్నారు. ఇందులో అధికార పార్టీకి చెం దిన ఓ నేత రూ. 2 కోట్ల వరకైనా ఖర్చు చేస్తా.. అధిష్ఠానం ఆశీస్సులు నాకే ఉన్నాయి. పీఠం దక్కించుకోవడం ఖాయమని తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నట్లు జోరు ప్రచారం జరుగుతోంది. 12 మండలాలున్న ఈ జిల్లా లో 12 జడ్పీటీసీల్లో మరో ఆరుగురిని అనుకూలంగా మలుచుకుంటే పీఠం దక్కనుంది. ఈ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లా ల్లో సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో అనే చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్‌‌టా పిక్‌ గా మారాయి.

Latest Updates