నామినేషన్లు: ZPTCలకు 2,104.. MPTCలకు 15,036

మొదటి దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. 197 జడ్పీటీసీలకు 2,104 నామినేషన్లు , 2,166 ఎంపీటీసీలకు 15,036 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితాలను అధికారులు అదే రోజు ప్రకటించనున్నారు. మొదటి దశ ఎన్నికలు మే 6న జరగనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పత్రాలు లేకపోవడంతో 20 జడ్పీటీసీలు, 16 ఎంపీటీసీ నామినేషన్లను తిరస్కరించారు.

Latest Updates