రూ.2800కే క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ : ప్ర‌క‌టించిన క్యాడిలా

ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ అత్య‌ధికంగా వ్యాప్తి చెందిన దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో వ్యాక్సిన్ త‌యారు చేసి దేశాన్ని కాపాడేందుకు ఆయా సంస్థ‌లు ప‌రిశోద‌న‌లు చేస్తున్నాయి. ఆ ప‌రిశోధ‌న‌లు సైతం స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. వీటిలో గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ రెమెడిసివిర్ అనే ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఔషధాన్ని ప్రస్తుతం 127 దేశాలు వినియోగిస్తున్నాయి.

తాజాగా జైడస్ క్యాడిలా అనే సంస్థ రెమ్ డాక్ పేరుతో యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. 100 ఎంజీ ఇంజక్షన్ ను కేవలం రూ. 2,800కు అందించాలని జైడస్ క్యాడిలా నిర్ణయించింది.

Latest Updates