లివర్ చికిత్స కోసం జైడస్​ కొత్త డ్రగ్

న్యూఢిల్లీ : లివర్ చికిత్స కోసం వాడే సరోగ్లిటజర్ మెగ్నీషియం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) వద్ద కొత్త డ్రగ్ అప్లికేషన్‌‌ను జైడస్ కాడిలా ఫైల్ చేసింది. నాన్‌‌ ఆల్కహాలిక్‌‌  స్టీటోహెపటైటిస్(ఎన్‌‌ఏఎస్‌‌హెచ్) అనేది లివర్‌‌‌‌కు సంబంధించిన వ్యాధి. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. 2013 సెప్టెంబర్‌‌‌‌లోనే ఇండియా సరోగ్లిటజర్‌‌‌‌ మెగ్నీషియాన్ని లాంచ్ చేసింది.

అయితే టైప్‌‌ 2 డయాబెటీస్‌‌ కోసం దీన్ని వాడేవారు. ఎన్‌‌ఏఎస్‌‌హెచ్‌‌తో బాధపడే వారికి కొత్త థెరపీలు కావాల్సి ఉందని, ఇప్పటి వరకు లివర్‌‌‌‌ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదని, కేవలం లివర్ మార్పిడితోనే బతుకుతున్నారని జైడస్ గ్రూప్ ఛైర్మన్ పంకజ్ ఆర్‌‌‌‌ పటేల్ చెప్పారు.

Latest Updates