చిన్నారులకూ‘కాక్‌‌టెయిల్‌‌’ఇంజక్షన్

చిన్నారులకూ‘కాక్‌‌టెయిల్‌‌’ఇంజక్షన్
  •  ఐవీఐజీ మందును కొనుగోలు చేస్తున్న రాష్ట్ర సర్కారు 

కరోనా నుంచి చిన్నారులను కాపాడుతున్న ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్‌‌(ఐవీఐజీ) ఇంజక్షన్లను భారీ స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్రహెల్త్ డిపార్ట్‌‌మెంట్ నిర్ణయించింది. ఈ ఇంజక్షన్ తీసుకున్న పిల్లలు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారన్న డాక్టర్ల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే 3 వేల ఇంజక్షన్లను తెప్పించి గాంధీ, నీలోఫర్, నిమ్స్‌‌కు అందజేశారు. మరో 7 వేల ఇంజక్షన్లను కొనుగోలు చేయనున్నట్టు హెల్త్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.  కృత్రిమంగా సృష్టించిన యాంటిబాడీస్‌‌తో ఈ డ్రగ్‌‌ తయారవుతుండడంతో, చాలా తక్కువ సంఖ్యలో ఉత్పత్తి జరుగుతోంది. కొంత మంది పిల్లలు పోస్ట్ కోవిడ్‌‌లో ఎంఐఎస్‌‌(మల్టీ సిస్టం ఇన్‌‌ఫ్లమెటరీ సిండ్రోమ్‌‌) బారిన పడి చనిపోతున్నారు. ఇసొంటి మరణాలను ఐవీఐజీ తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు.