400 మందితో దేశం నిర్మించుకోవడమా.. ఇదెలా సాధ్యం..? 21 ఏళ్ల యువకుడి స్టోరీ వైరల్!

400 మందితో దేశం నిర్మించుకోవడమా.. ఇదెలా సాధ్యం..? 21 ఏళ్ల యువకుడి స్టోరీ వైరల్!

మనకు మనంగా ఒక దేశాన్ని నిర్మించుకోలగలమా.. ఇది సాధ్యమయ్యే పనేనా..? ఈ 21 ఏళ్ల యువకుడి కథ గురించి తెలుసుకుంటే సాధ్యమే అనిపిస్తుంది. అతి చిన్న వయసులో ప్రత్యేక దేశం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు బ్రిటీష్-ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన డేనియల్ జాక్సన్ అనే యువకుడు. 

 ఐరోపాలో ఒక సరిహద్దు వివాదం కారణంగా ఎవరికీ చెందకుండా మిగిలిపోయిన ఒక చిన్న భూభాగాన్ని దేశంగా మార్చుకున్నాడు డేనియల్ జాక్సన్.  ది ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ (Free Republic of Verdis) అనే సరికొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకున్నాడు. ఈ  మైక్రోనేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కొత్త దేశం ఏర్పాటు వెనుక ఉన్న వాస్తవాలను గురించి తెలుసుకుదాం.  డేనియల్ జాక్సన్‌కు కేవలం 14 ఏళ్ల వయసులోనే సొంతంగా ఒక దేశాన్ని సృష్టించాలనే ఆలోచన వచ్చింది. చివరకు 2019 లో (అతనికి 18 ఏళ్లు ఉన్నప్పుడు) ఈ దేశాన్ని ప్రకటించాడు. 

  క్రొయేషియా, సెర్బియా దేశాల మధ్య డానుబే నది ఒడ్డున ఉన్న పాకెట్ 3 అనే సుమారు 125 ఎకరాల (0.5 చదరపు కిలోమీటర్లు) అటవీ భూమిలో కొత్త దేశం ఏర్పాటు చేశాడు. ఈ స్థలాన్ని ఏ దేశమూ అధికారికంగా క్లెయిమ్ చేయకపోవడంతో (నో మ్యాన్స్ ల్యాండ్), దీన్ని డేనియల్ తన దేశంగా ప్రకటించుకున్నాడు. 

 ఈ దేశానికి సొంతంగా జాతీయ జెండా, రాజ్యాంగం, క్యాబినెట్ (మంత్రుల మండలి) ఉన్నాయి. అంతేకాదు, వీరు సొంతంగా పాస్‌పోర్టులను కూడా జారీ చేస్తున్నారు. 

 15   వేలకు పైగా దరఖాస్తులు:

 ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 400 మంది అధికారికంగా ఇందులో పౌరసత్వం పొందారు. అలాగే పౌరసత్వం కోసం ఇప్పటివరకు 15,000 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. 
 
  అంతర్జాతీయ సమాజం వెర్డిస్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. క్రొయేషియా అధికారులు డేనియల్‌ను ఆ భూభాగంలోకి వెళ్లకుండా నిషేధించడంతో, ప్రస్తుతానికి అతను ఈ దేశాన్ని ఆన్‌లైన్ ద్వారా డిజిటల్‌గా గవర్నమెంట్ ఇన్ ఎక్జైల్  రూపంలో నడుపుతున్నాడు. 

 
 ఇటీవల అక్టోబర్ 2026 లో, ఐవరీ కోస్ట్‌లో ఈ వెర్డిస్ దేశం తరఫున చేసిన మానవతా సేవలకు గాను డేనియల్ జాక్సన్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అంతర్జాతీయ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం.