Aha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్ అభిన‌వ్ గోమటం (Abhinav Gomatam) హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియ‌ర్ దొంగ (My Dear Donga). స‌ర్వ‌జ్ఞ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ  మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. మై డియ‌ర్ దొంగలో అభిన‌వ్ గోమ‌టంకి జోడీగా శాలిని కొండెపూడి (Shalini Kondepudi) హీరోయిన్గా నటించింది.

ఆహా ఓటీటీ ట్విట్ట‌ర్‌ ఈ మూవీ పోస్టర్ను పంచుకుంటూ..ఓ ఇంట్రెస్ట్ ట్యాగ్ను జోడించింది. ఇప్పటివరకు ప్రేక్షకులు అడ‌వి దొంగ విన్నారు. ట‌క్క‌రి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియ‌ర్ దొంగ ఎవ‌రో తెలియాలంటే..త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న..మై డియ‌ర్ దొంగ సినిమా చూడాల్సిందే అంటూ ట్యాగ్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు అభినవ్ గోమటం చేసే సరదా సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అర్ధం చేసుకుంటున్నారు. 
 
ఈ మూవీ జ‌న‌వ‌రి లాస్ట్ వీక్లో మై డియ‌ర్ దొంగ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.త్వరలో మేకర్స్ నుంచి అఫీషియ‌ల్‌ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మించాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న శాలిని కొండెపూడి రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.అజ‌య్ అర‌సాడా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని..డైరెక్ట్‌గా ఆహా ఒరిజిన‌ల్(Aha Original) మై డియ‌ర్ దొంగ‌ను రూపొందించిన‌ట్లు స‌మాచారం. 

అభినవ్ గోమటం సినిమాలు చూసుకుంటే..2014లో వచ్చిన మైనే ప్యార్ కియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన..2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే త‌న కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆక‌ట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం హిలేరియ‌స్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ న‌వ్వించింది. అలాగే ఈ మధ్య కాలంలో అభినవ్ సినిమాలు చూసుకుంటే..మీకు మాత్ర‌మే చెప్తా, శ్యామ్ సింగ‌రాయ్‌తో, విరూపాక్ష తో పాటు ప‌లు సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా ఓటీటీ లో వచ్చిన సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కడంతో సెకండ్ సీజ‌న్ కూడా త్వరలో రాబోతోంది.