అందుకే సూర్యను పెళ్లి చేసుకున్న: నటి జ్యోతిక

అందుకే సూర్యను పెళ్లి చేసుకున్న: నటి జ్యోతిక

టాలీవుడ్, కోలీవుడ్ లో పదికి పైగా హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. అందులో ఒక చక్కని జంట ఎవరంటే..టక్కున గుర్తొచ్చేది..సూర్య(Suriya)..జ్యోతిక(Jyothika) అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ నటనలోనూ, ఆహ్యార్యంలోను, సామాజిక సేవ దృక్పథంలోనూ ఆదర్శంగా నిలిచారు.

హీరోయిన్ జ్యోతిక..సూర్యను పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో చెప్పింది. అలాగే వీరి మధ్య చిగురించిన లవ్ స్టోరీ..ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, తిరిగి సినిమా సెకండ్ ఇన్నింగ్ వంటి విశేషాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిన్న (అక్టోబర్ 18) తన 45వ పుట్టిన రోజు సందర్భంగా మ్యారేజ్ విశేషాలు మాట్లాడుతూ..అంతా నెల రోజుల్లోనే పెళ్లి అయిపోయినట్లు తెలిపారు. 

సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ చాలా సింపుల్ గా..ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెపుతూ..పెళ్లి చేసుకోవడానికి సూర్య నాకు ఇచ్చిన గౌరవమే మా పెళ్ళికి నాంది పలికింది. మా ఫస్ట్ మూవీలో ఎంతో క్యాజువల్ గా మాట్లాడగా..ఇక ఆ తర్వాత వరుసగా ఏడు సినిమాల్లో కలిసి నటించేలా జర్నీ సాగిందని తెలిపారు. ఇదే కాకుండా.. డైరెక్టర్ ఏదైనా రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు..సూర్య అంత వరకే మాత్రమే నటించేవాడని.. అంతేకాని అదునుగా తీసుకునేవాడు కాదని..హీరోయిన్స్ పట్ల అతనికి ఉన్న ఆ గౌరవమే నన్ను ఆకర్షించిందని పేర్కొన్నారు జ్యోతిక.

ఇక వరుస సినిమాలు చేసే టైంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. దీంతో నా ఫ్యామిలీ కూడా మా ఆపెళ్ళికి ఒప్పుకోవడంతో..మరీ ఎక్కువగా ఆలోచించకుండా నెలలోపే మ్యారేజ్ చేసుకున్నా..అని జ్యోతిక తన లవ్ జర్నీని వివరించింది. ప్రస్తుతం హీరో నేషనల్ లెవెల్ హీరోగా వరుస భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక జ్యోతిక ప్రొడ్యూసర్ గా, నటిగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.