
అహ్మదాబాద్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదం తర్వాత.. ఇండియన్ సినీ పరిశ్రమ సమిష్టిగా మౌనం పాటిస్తోంది. గురువారం (జూన్ 12న) ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే.. క్రాష్ అయ్యి 297 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
ఈ విమాన ప్రమాదం తర్వాత, బాధితులకు మరియు వారి కుటుంబాలకు గౌరవ సూచకంగా సంఘీభావంగా నిలిచేందుకు రెండు పాన్ ఇండియా సినిమాలు తమ ప్రమోషన్ ఈవెంట్లను రద్దు చేసుకున్నాయి.
ఇవాళ (జూన్ 13న) ఇండోర్‌లో జరగాల్సిన 'కన్నప్ప' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను మంచు విష్ణు రద్దు చేస్తూ ట్వీట్ చేశారు. 'అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వార్తా వినగానే నా గుండె పగిలిపోయింది. దేశమంతా తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కనప్ప ట్రైలర్ విడుదలను.. ఒక రోజు వాయిదా వేస్తున్నాము. జూన్ 13న జరగాల్సిన ఇండోర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సైతం రద్దు చేస్తున్నాము. ఈ ఊహించలేని క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని విష్ణు తెలిపారు.
Life is precious yet unpredictable. Some incidents remind us never to take a single moment for granted. Let’s cherish every day, express gratitude, hold our loved ones closer, and spread positivity wherever we can. Stay strong, stay grateful. 🌟❤️ #HarHarMahadev
— Vishnu Manchu (@iVishnuManchu) June 13, 2025
అలాగే, జీవితం విలువైనది కానీ అనూహ్యమైనది. కొన్ని సంఘటనలు ఒక్క క్షణం కూడా తేలికగా తీసుకోకూడదని మనకు గుర్తు చేస్తాయని మంచు విష్ణు ఎమోషన్ ట్వీట్స్ చేశారు.
అయితే, జూన్ 13న ఇండోర్‌లో జరగాల్సిన 'కన్నప్ప' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అన్ని భాషల మీడియా ప్రతినిధులను అక్కడికి ఆహ్వానించారు. తెలుగు మీడియా ప్రతినిధులు కూడా రేపు ఉదయాన్నే ఫ్లైట్లో వెళ్లాల్సి ఉంది. కాగా ఈ కన్నప్ప మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
My heart breaks for the lives lost in today’s Ahmedabad Air India crash. In deep mourning, we’re deferring the #Kanappa trailer release by one day and canceling tomorrow’s Indore pre‑release event. My prayers are with the families during this unimaginably difficult time. 💔
— Vishnu Manchu (@iVishnuManchu) June 12, 2025
కన్నప్పతో పాటు సల్మాన్ ఖాన్ ఈవెంట్ కూడా రద్దు చేయబడింది.ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబైలో జరగాల్సిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) ఈవెంట్ వాయిదా వేశారు.
ఈ క్లిష్ట సమయంలో దేశం ఐక్యంగా ఉండటంతో పాటు బలంగా నిలుస్తున్నారు. బాధిత కుటుంబాలకు మా సంతాపం మరియు ప్రార్థనలు ఉన్నాయని ISRLవ్యవస్థాపకుడు ఈషాన్ లోఖండే ఒక ప్రకటనలో తెలిపారు. ISRL యొక్క కొత్త సీజన్‌ను సూపర్ స్టార్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సల్మాన్ ఆవిష్కరించనున్నాడు.
🚨 Breaking: Superstar #SalmanKhan cancels today’s ISRL event following the heartbreaking #AhmedabadTragedy 💔 A mark of respect during this difficult time.#SalmanKhan #ISRL #Ahmedabad #BreakingNews #Respect #AirIndia #planecrash #AhmedabadPlaneCrash #AirIndiaCrash pic.twitter.com/rzHg5yUB3K
— "Movie Keeda Diaries : Cinematic Obsession" (@altamash4u) June 12, 2025
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ కూడా తమ రాబోయే చిత్రం సీతారే జమీన్ పర్ నుండి కొత్త పాట విడుదలను వాయిదా వేసింది. జరుగుతున్న విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్టూడియో అన్ని ప్రమోషన్ ఈవెంట్స్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. గత నెలలో భారతదేశం-పాకిస్తాన్ వివాదం మధ్య 'సీతారే జమీన్ పర్ ట్రైలర్' లాంచ్‌ను సైతం వాయిదా వేసింది.
ఇకపోతే, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా దగ్గుబాటి నటించిన 'రానా నాయుడు సీజన్ 2' ప్రీమియర్ కూడా రద్దు అవుతున్న జాబితాలో చేరుతోంది. ఈ సిరీస్ నేడు జూన్ 13న ప్రీమియర్ కానుంది.
Rana’s only rule: When it comes to his family, he follows no rules 👊🥵
— Netflix India (@NetflixIndia) June 3, 2025
Watch Rana Naidu Season 2, as he returns with drama, dhamaka, and destruction on 13 June, only on Netflix.#RanaNaiduOnNetflix #JoLineCrossKiyaWoGaya pic.twitter.com/2z6OckWG8W