
అమర్ దీప్(Amar deep).. బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) తరువాత ఈ పేరు బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు కూడా చాలా తెలుగు సీరియల్స్ లో కనిపించిన ఈ నటుడు.. బిగ్ బాస్ తరువాత మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యాడు. సీజన్ 7కి రన్నరప్ గా నిలిచిన అమర్.. హౌస్ ఆడిన ఫౌల్ గేమ్స్ వల్ల బయట చాలా నెగిటీవ్ అయ్యాడు. ఎంతలా అంటే సీజన్ ముగించుకొని బయటకు వచ్చే సమయంలో తన కారుపై దాడులు చేసేంతలా. దాంతో కొన్నిరోజులు బయట కేసుల కనిపించకుండా అజ్ఞాతంలో గడిపారు. ఇక పరిస్థితులు సద్దుమణగడంతో ఇప్పుడిప్పుడే బయటకుక్ వస్తున్న అమర్.. తాజాగా హీరోగా సినిమా చేయడానికి సిద్దమయ్యాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవీంద్ర కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నటించనుందని తెలుస్తోంది. సుప్రీత(Supreeta) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. రాయితీ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమర్ దీప్, సుప్రీత.. నిజంగా ఈ కాంబో గనక ఒకే అయితే థియేటర్స్ లో ఆడియన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం. ఇన్నిరోజులగా సోషల్ మీడియాలో, బుల్లితెరపై అలరించిన ఈ ఇద్దరు.. వెండితెరపై ఎలా ఎంటర్టైన్ చేయనున్నారో చూడాలి మరి.