
హైదరాబాద్, వెలుగు : ఇన్నోవేషన్లను, ఎంట్రప్రిన్యూర్షిప్ను పెంపొందించే అమిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ (ఏఐఐ) మనదేశ రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) కార్యక్రమానికి పార్ట్నర్ ఇంక్యుబేటర్‌గా ఎంపికయింది.
రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని తెలిపింది. భారత రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన కొత్త, వినూత్న టెక్నాలజీల అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొంది.