అన్షు, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలో ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. బుధవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్‌ను లాంచ్ చేసిన డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘చూడగానే రియలిస్టిక్ యంగ్‌స్టర్ సినిమాలా అనిపించింది. యువతరానికి కనెక్ట్ అయ్యే సినిమా. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ‘యూత్‌తో పాటు పేరెంట్స్ చూడాల్సిన ఫ్యామిలీ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశాం’ అని చెప్పాడు. ఓ మంచి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పామని నిర్మాత కె.వెంకట్ యాదవ్ తెలిపారు. హీరోహీరోయిన్స్ అన్షు, వాసవి గణేషన్, మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ పాల్గొన్నారు.
