నవరాత్రి ఉత్సవాల్లో వింత ఘటన ఒకటి చోటుచేసుకుంది. మహిళ శరీరంపై బార్లీ విత్తనాలు (జవారే) మొలకెత్తడం స్థానికంగా సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అమ్మ వారి కటాక్షంతోనే మొలకలు మొలిచాయని.. దీక్ష వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పడంతో.. ఆ మహిళను చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మౌరానీపూర్ ప్రాంతంలోని బుఖారా గ్రామంలో జరిగింది ఈ ఘటన. గౌరైయా మాతా మందిరంలో శరీరంపై మొలకలు పెంచుకుని దీక్ష తీసుకుంది జానకీ దేవి అనే మహిళ. ఆనోట ఈ నోట ఈ విషయం ప్రచారం కావడంతో సదరు మహిళ దీక్ష చూసేందకు భక్తులు ఉవ్వెత్తున తరలివస్తున్నారు.
రాజ్‌కుమార్ అహిర్వార్ భార్య జానకీ దేవికి కలలో మాతా రాణి దర్శనం అయ్యిందని చెబుతున్నారు. అమ్మవారి ఆజ్ఞపించడంతో ఈ దీక్ష తీసుకున్నట్లు తెలిపారు. తన చుట్టు పక్కల గ్రామాల ప్రజల సుఖసంతోషాలు, సంపద కోసం తాను ఈ సాధన చేస్తున్నానని ఆమె చెప్పారు.
సాధారణంగా నవరాత్రుల్లో బార్లీ (జౌ) మొలకలను మట్టి పాత్రల్లో లేదా పూజా స్థలాల్లో నాటుతారు. కానీ ఇక్కడ ఆమె శరీరంపైనే పెంచడం వల్ల ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సుమారు 15 రోజులుగా మందిరంలో పూజలు, మంత్ర జపాలు, భజనలు కొనసాగుతున్నాయి. ఈ అనూహ్య ఘటనను చూడటానికి, గౌరైయా మాతా దర్శనం చేసుకోవడానికి, ఆరతిలో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో దేవీ ఆరాధన, నవరాత్రి, జవారే సంప్రదాయానికి ప్రత్యేకత ఉంది. అయితే జానకీ దేవి కుటుంబం, గ్రామస్తులు ఈ సాధనను మాతా కృపగా భావిస్తున్నారు. ఆమె అందరూ సుఖంసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.
उत्तर प्रदेश के झांसी जिले के मऊरानीपुर क्षेत्र के बुखारा गांव स्थित गौरैया माता मंदिर में जानकी देवी की अनोखी साधना चर्चा का विषय बनी हुई है। जानकी देवी के अनुसार, सपने में माता रानी के दर्शन के बाद उन्होंने शरीर पर जवारे उगाने का संकल्प लिया। उनकी साधना को देखने और माता के दर्शन के लिए श्रद्धालु पहुंच रहे हैं। #jhansinews #goraiyamatamandir #uttarpradeshnews #viralnews #tnpnews jhansi news, goraiya mata mandir, bukhara village, mauranipur jhansi, janaki devi sadhna, jaware sadhna, mata rani bhakti, uttar pradesh news, jhansi viral video, tnp news
— TNP NEWS (@TNPNEWS1) October 17, 2026
