తిరుమల ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్ చల్

నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై తరచూ కనిపిస్తున్నాయి. . తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచరించింది.  ఆ మధ్య చిరుతల  సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది.

తిరుమల ఘాట్ రోడ్లతో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో  భక్తులు భయాందోళనకు గురైతున్నారు. అటవీశాఖ సిబ్బంది మాత్రం ఎలుగుబంట్లు వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని….వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్ళించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.