ఛలో సెక్రటేరియట్: ఎక్కడికక్కడ టీచర్ల అరెస్టులు

ఛలో సెక్రటేరియట్:  ఎక్కడికక్కడ టీచర్ల అరెస్టులు

ఉపాధ్యాయుల అసంబద్ధ బదిలీలకు కారణమైన జీవో 317 రద్దు చేయాలంటూ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది ఉపాద్యాయుల సంఘం. దీంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన ఉపాధ్యాయులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘ నేతలను రాత్రి నుంచే పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. సిద్ధిపేట పట్టణంలో TPTF నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సెక్రటరియేట్ కార్యక్రమానికి వెళ్లకుండా ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జీవో 317 రద్దు చేసి లోపాలు లేకుండా బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయులు  డిమాండ్ చేస్తున్నారు.