చెన్నూరులో కాంగ్రెస్ జోరు.. వివేక్ సమక్షంలో పార్టీలో చేరిన చిరు వ్యాపారులు..

చెన్నూరులో కాంగ్రెస్ జోరు.. వివేక్ సమక్షంలో పార్టీలో చేరిన చిరు వ్యాపారులు..

చెన్నూరులో పార్టీ జోరు కొనసాగుతోంది. చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా షాప్స్ కోల్పోయిన చిరువ్యాపార బాధితులు స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఎన్నిసార్లు మా బాధ చెప్పిన పట్టించుకోవటం లేదని... 2023, నవంబర్ 25వ తేదీ శనివారం చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి  డాక్టర్ వివేక్ వెంకటస్వామిని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా150 మంది బాధిత చిరు వ్యాపారులకు హస్తం కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు.

బాల్క సుమన్ ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని వారు విమర్శించారు. ఇసుక దందా, భూకజ్జాలతో చెన్నూరు సంపదను బాల్క సుమన్ దోచుకుంటున్నాడని వివేక్ వెంకటస్వామి  ఆరోపించారు.   ప్రజల సమస్యలను గాలి వదిలేసి.. ప్రజా ధనాన్ని లూటీ చేయడమే బాల్క సుమన్ పనిగా పెట్టుకున్నాడని..చెన్నూరులో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని వివేక్ కోరారు.