
హగ్... మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని ఇప్పటివరకు చేసిన ఎన్నో స్టడీల్లో తేలింది. అందుకేనేమో చైనాలో అమ్మాయిలు డబ్బులిచ్చి మరీ మగవాళ్ల హగ్‌ని కోరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ‘మ్యాన్ మమ్స్’ పేరుతో ఒక ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా ఒత్తిడిలో ఉన్న ఆడవాళ్లు తమకు పరిచయమే లేని మగవాళ్లను హగ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎంతో ఓదార్పు కలుగుతుందని చెప్తున్నారు. హగ్ ఇచ్చినందుకు మగవాళ్లకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఐదు నిమిషాల కౌగిలింతకు దాదాపు 50 యువాన్లు (రూ. 600) చెల్లిస్తున్నారు.
చైనాలో కండలు తిరిగిన మగవాళ్లను ‘మ్యాన్ మమ్స్’ అని పిలిచేవాళ్లు. అయితే.. ఇప్పుడు హగ్స్ ఇచ్చేవాళ్లని ఆ పేరుతో పిలుస్తున్నారు. ఆడవాళ్లు సోషల్ మీడియా చాట్‌యాప్‌ల ద్వారా హగ్ ఇచ్చే పార్ట్‌నర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కలవడానికి ముందు ప్రైవేట్‌గా చాటింగ్ కూడా చేస్తారు. ఆ తర్వాత మాల్స్, సబ్‌వే స్టేషన్లు.. లాంటి బహిరంగ ప్రదేశాల్లో కలుసుకుని హగ్ చేసుకుంటున్నారు.
ఈ మధ్య ఒత్తిడికి గురైన ఒక స్టూడెంట్ ఆన్‌లైన్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తన థీసిస్ వల్ల కలిగిన ఒత్తిడిని తట్టుకోవడానికి ఒక ఫిట్‌గా ఉండే మ్యాన్ మమ్ కౌగిలింత కావాలని, అందుకు తాను డబ్బు చెల్లించడానికి రెడీగా ఉన్నాననేది ఆ పోస్ట్ సారాంశం. తను సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి అబ్బాయిని కౌగిలించుకున్నానని అప్పుడు చాలా ఉపశమనం పొందానని పోస్టులో రాసింది. ఈ పోస్ట్ చైనాలో చాలా వైరల్ అయ్యింది. ఇదొక్కటే కాదు.. సోషల్‌మీడియాలో ఈ మధ్య ఎంతోమంది ఇలాంటి పోస్ట్‌లు చేస్తున్నారు.
రెగ్యులర్‌గా హగ్స్ ఇచ్చి డబ్బు సంపాదించే జౌ ‘నా క్లయింట్లలో చాలామంది రకరకాల సమస్యలతో వస్తుంటారు’ నా హగ్ వల్ల వాళ్లు ఒత్తిడికి దూరం అవుతున్నారు” అంటున్నాడు. అతను ఏప్రిల్‌లో 34 కౌగిలింతలు ఇచ్చి, 1,758 యువాన్లు (రూ.20,971) సంపాదించాడు. తన క్లయింట్స్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు జౌ ఎప్పుడూ మేకప్ వేసుకుని పెర్ఫ్యూమ్ కొట్టుకుని, జుట్టును స్టైల్‌గా దువ్వుకుని మరీ వెళ్తాడు.