కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఐఎంఎంటీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ I (పీఏటీ I ), ప్రాజెక్ట్ అసోసియేట్ II (పీఏటీ II ), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (ఎస్– పీఏటీ), జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్).
మొత్తం ఖాళీలు: 38.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బీఎస్సీ, ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు.
ప్రాజెక్ట్ అసోసియేట్ I, ప్రాజెక్ట్ అసోసియేట్ II పోస్టులకు 35 ఏళ్లు.
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 40 ఏళ్లు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ, మహిళలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 14.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 23, 24, 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ immt.res.inను సందర్శించండి.
