
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కథ, స్ర్కీన్‌ప్లే శేష్ అందించగా, షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్.. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా శేష్ డబ్బింగ్ టెస్ట్‌ను పూర్తి చేశాడని టీమ్ తెలియజేసింది. అలాగే జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్‌ని ప్రారంభించనున్నట్టు, ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నట్టు అప్‌డేట్ ఇచ్చారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.