అకాడమీ ఆఫ్ మ్యూజియం గాలా లో మెరిసిన దీపికా పదుకొణె

అకాడమీ ఆఫ్ మ్యూజియం గాలా లో మెరిసిన దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె( Deepika Padukone )..ఈ సంవత్సరం ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌ల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరుగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా ఆమె ఆస్కార్ వేదికపై RRR మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది. 

లేటెస్ట్ గా దీపికా పదుకునే ప్ర‌ఖ్యాత ఆస్కార్ అవార్డు వేడుక‌ల్నినిర్వ‌హించే అకాడమీ ఆఫ్ మ్యూజియం గాలా ( 3rd Annual Academy Museum Gala) అవార్డుల కార్య‌క్ర‌మంలో  పాల్గొన్నారు. ఆకాడ‌మీ ఆఫ్ మ్యూజియం బోర్డు నిర్వహించే రెండవ అతిపెద్ద వేదికలో ఇదొకటి.ఇంతటి గొప్ప వేదికపై దీపిక‌కి స్థానం ద‌క్క‌డం గొప్ప విశేషంగానే భావించాలి. 

ఎందుకంటే,ఇటువంటి గొప్ప వేదికపై ఇంత‌వర‌కూ..ఏ భారతీయ నటి పాల్గొనలేదు.గతంలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా వంటి హేమ హేమీలు కూడా ఎన్నో గొప్ప వేదికలపై స్టార్స్ గా పాల్గొన్నారు. కానీ, దీపికా పదుకునే వారిద్దరినీ బీట్ చేస్తూ..తొలిసారి గాలా వేదిక‌పైనా మెరిసి రికార్డు క్రియేట్ చేసింది.ఈ వేదికపైనా మన భారతదేశపు గొప్పతనాన్ని, సినీ పరిశ్రమలు అందిస్తోన్న విభిన్న చిత్రాల గురుంచి చాలా గొప్పగా మాట్లాడే అవకాశం దక్కించుకున్న నటిగా దీపికా ఘనత సాధించింది. 

అంతేకాకుండా..ఈ వేదికలో దీపికా చాలా చక్కగా కనిపించి అందరినీ అట్ట్రాక్ట్ చేసింది.ప్ర‌త్యేక డిజైన‌ర్ చేసిన దుస్తుల్లో మెరిసి వావ్ అనిపించుకొంది. బ్లూ క‌ల‌ర్ ముకుముల్ల ఔట్ ఫిట్ లో కనిపిస్తూ..చేతి వేళ్ళకు, మణికట్టుకి, చెవి రింగులు తో కలిపి అన్ని వైట్ కలర్ లో ఉండేలా చూసుకుంది.

అలాగే పెదాల‌పై అంద‌మైన న‌వ్వు మెయింటేన్ చేయడం వల్ల మరింత అందంగా దీపికా అందరినీ ఆకర్షితులను చేసింది.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీపికా గాలా వేదికలో పాల్గొనడంపై పలువురు సెలబ్రేటిస్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.