న్యూమరాలజీ: మీ పేరులో ఈ 3 అక్షరాలు ఉన్నాయా ?: లక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్లు ధనవంతులవుతారు..?

న్యూమరాలజీ: మీ పేరులో ఈ 3 అక్షరాలు ఉన్నాయా ?: లక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్లు ధనవంతులవుతారు..?

చాలామంది వాళ్ళ పేర్ల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ మరికొందరు వాళ్ళ  పేరు కలిసొరాలేదని స్పెల్లింగ్ మార్చుకుంటూ ఉండటం మీరు చూసే ఉంటారు. కానీ సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం, మన పేరులోని మొదటి అక్షరమే మన "లక్కీ లెటర్". పేరులోని ప్రతి అక్షరంపై ఒక గ్రహ ప్రభావం ఉంటుంది. అది మన వ్యక్తిత్వాన్ని, బలాలను చెప్తుంది. కొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి ఎప్పుడూ ఆర్థికంగా తిరుగుండదని, లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని అంటారు. మరి ఆ అదృష్ట అక్షరాలు ఏవో తెలుసుకుందామా.....

1. 'B' అక్షరం

'B' అక్షరంతో పేరు మొదలయ్యే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరు డబ్బును, సంపదను సహజంగానే ఆకర్షిస్తారు. ఇంకా వీరు చాలా శాంతస్వభావులు, నిరాడంబరంగా ఉంటారు. వీరి ప్రవర్తనే ఇతరులను ఆకట్టుకుంటుంది. అలాగే ధైర్యవంతులు, నిజాయితీపరులు ఇంకా అనుకున్నది సాధించే పట్టుదల ఉన్నవారు. ఏ పని చేపట్టినా ప్రాణం పెట్టి చేస్తారు. అందుకే త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

2. 'H' అక్షరం

'H' అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ (నాయకత్వ లక్షణాలు) చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు అనుకున్న పనిని పూర్తిచేసే వరకు వదలిపెట్టరు. వీరికి పని పట్ల ఉండే అంకితభావం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వీరి కష్టపడే తత్వానికే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అందుకే వీరికి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు.

3. 'M' అక్షరం 

'M' అక్షరం క్రమశిక్షణకు, పక్కా ప్లానింగ్‌కు, కష్టపడే తత్వానికి ప్రతీక. వీరు జీవితంలో స్థిరత్వానికి, లాంగ్ టర్మ్ గోల్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. వీరు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సొంతంగా నాయకత్వం వహించడమే వీరికి ఇష్టం. స్వేచ్ఛా భావాలు, పెద్ద ఆశయాలు ఉన్న వీళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి దగ్గర కూడా డబ్బు పుష్కలంగా ఉంటుంది.

గమనిక: మీ పేరు కూడా ఈ అక్షరాల్లో ఒకదానితో మొదలైతే ఈ గుణాలు మీకు ఉండవచ్చు. అయితే ఇవి కేవలం సాధారణ అంచనాలు మాత్రమే, వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది.


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.