రాజమండ్రిలో క్లైమాక్స్.. చివరిదశకు దుల్కార్ ఆకాశంలో ఒక తార మూవీ షూటింగ్

 రాజమండ్రిలో క్లైమాక్స్.. చివరిదశకు దుల్కార్ ఆకాశంలో ఒక తార మూవీ షూటింగ్

దుల్కర్ సల్మాన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు. దుల్కర్‌‌‌‌కు జంటగా సాత్విక వీరవల్లి నటిస్తోంది. శ్రుతిహాసన్ కీలకపాత్రను పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆదివారం అప్‌‌డేట్ ఇచ్చారు. సోమవారం నుంచి కొత్త షెడ్యూల్‌‌ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. క్లైమాక్స్‌‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

హీరోహీరోయిన్స్‌‌ దుల్కర్ సల్మాన్, సాత్విక ఈ షూట్‌‌లో పాల్గొంటారని దర్శకనిర్మాతలు తెలియజేశారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్. చివరిదశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం వేసవిలో పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా విడుదల కానుంది.