అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..సిద్దిపేట జిల్లాలో ఘటన

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..సిద్దిపేట జిల్లాలో ఘటన

తొగుట, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తొంట నర్సింలు(46) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం కాగా, ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఒకేసారి పెళ్లి, ఇంటి నిర్మాణం చేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. శుక్రవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి మృతిచెందాడు.